రాయికల్ పట్టణంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందించడమే లక్ష్యంగా ఈ కార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ తెలిపారు.
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపడుతుందని మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ అన్నారు. రాయికల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంప్రదాయ రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. వీటి ద్వారా రేషన్ లబ్ధిదారుల వివరాలను సులభంగా గుర్తించడంతో పాటు ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంపొందించేందుకు అవకాశం ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, తాహసిల్దార్ నాగార్జున, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, ఆర్ ఐ పద్మయ్య, జిపిఓలు దాస్ కుమార్, రాజేందర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, రేషన్ షాప్ డీలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.












