దీపావళి పండుగ సందర్భంగా మిషన్ భగీరథ ఈపీపీఎల్ కంపెనీ యాజమాన్యం తమ ఉద్యోగులకు బోనస్ అందించింది. షాద్నగర్ పరిధిలోని మిషన్ భగీరథ వాటర్ గ్రేడ్ డివిజన్లో పనిచేస్తున్న లైన్మెన్లు, సూపర్వైజర్లు, ఆపరేటర్లు ఈ సందర్భంగా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
పండుగ వేళ తమ శ్రమను గుర్తించి బోనస్ అందించిన ఈపీపీఎల్ కంపెనీ యాజమాన్యానికి, ఇంజనీర్లకు ఉద్యోగులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉద్యోగుల సంక్షేమం పట్ల యాజమాన్యం చూపిన ఈ చొరవ తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందని ఉద్యోగులు పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా యాజమాన్యం ఇదే విధంగా ఉద్యోగుల సంక్షేమానికి సహకరిస్తూ ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.












