బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సెలవుల కాలంలో లబ్ధిదారులకు వేడి భోజనానికి బదులుగా టేక్ హోమ్ రేషన్ పంపిణీకి అనుమతి లభించింది.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం ఈ సెలవులను ప్రకటించారు. వ తేదీ నుంచి రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయి.
ఈ సెలవుల కాలంలో లబ్ధిదారులకు సాధారణంగా అందించే వేడి భోజనం (హాట్ కుక్డ్ మీల్)కు బదులుగా టేక్ హోమ్ రేషన్ () పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చారు. తమ పరిధిలోని అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, హెల్పర్లకు అవసరమైన సూచనలు జారీ జిల్లా సంక్షేమ అధికారులు (), శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులను () శాఖ ఆదేశించింది.
ప్రభుత్వ స్కూల్ టీచర్ల మాదిరిగానే తమకు బతుకమ్మ, దసరా సెలవులు మంజూరు చేసినందుకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. అంగన్వాడీ చరిత్రలోనే మొదటిసారిగా దసరా సెలవులు ఇచ్చి, అంగన్వాడీ టీచర్లను, హెల్పర్లను బతుకమ్మ సంబరాలను సంబరంగా చేసుకోమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంద్ర ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షురాలు డి. అన్నపూర్ణ.












