కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలంలోని దామరంచ గ్రామస్తులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు ప్రెసిడెంట్ ఆర్డర్లను పంపిణీ చేశారు.
ఇళ్ల నిర్మాణం జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ హైమద్ కూడా పాల్గొన్నారు.












