మంచిర్యాల జిల్లా మోసం గ్రామానికి చెందిన గ్రామ పాలనా అధికారి డి. శ్రీనివాస్, లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ,ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుని తండ్రి పేరును రెవెన్యూ రికార్డులలో సరిచేసి, నివేదిక సమర్పించేందుకు రూ. 22,000/- లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ రేంజ్ పరిధిలోని మోసం గ్రామానికి చెందిన గ్రామ పాలనా అధికారి డి. శ్రీనివాస్, లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ,ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుని తండ్రి పేరును రెవెన్యూ రికార్డులలో సరిచేసి, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించేందుకు ఆ అధికారి రూ. 22,000/- లంచం డిమాండ్ చేశారు. ఈ నివేదిక ద్వారా ఫిర్యాదుదారుడు, అతని సోదరుడు తమ వ్యవసాయ భూమికి సంబంధించి ఉత్తరాధికారాన్ని పొందే అవకాశం ఉంది.
ఏసీబీ వలలో పడిన అధికారి
దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, పథకం ప్రకారం, నిందితుడు తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ. 22,000/- లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ లంచం తీసుకున్న నిందితుడిని అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కరీంనగర్లోని ఎస్పీఈ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.
దర్యాప్తు వివరాలు
ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచినట్లు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.
ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వాట్సాప్ ,9440446106 ఫేస్బుక్ , ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ క్యూఆర్ కోడ్ ప్రదర్శించబడిందని, బాధితులు, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు స్పష్టం చేశారు.











