ధర్మపురి, 7 September
ప్రేమ పేరుతో నమ్మించి, చివరికి ప్రాణం తీసుకునే పరిస్థితికి నెట్టిన ఘటన కలకలం రేపుతోంది. డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఈశ్వర్ సాయిపై మాధురి ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు అతన్ని అరెస్ట్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమ పేరుతో నమ్మించి, చివరికి ప్రాణం తీసుకునే పరిస్థితికి నెట్టిన ఘటన కలకలం రేపుతోంది. బాసింగ బాసింగ భలాలే.. వుట్టా చేతుల.. వుట్టా చేతుల పంపను పిల్లా.. అటో డజను.. ఇటో డజను గాజులు వేయిస్తా పిల్లా వంటి మాటలు వినిపిస్తే.. ఒక అమ్మాయి తన భవిష్యత్తును ఎలా ఊహించుకుంటుందో కదా. తనను పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తిని నమ్మింది.. ఆ మాటలను నిజమని భావించింది.. కానీ అదే నమ్మకం చివరికి కన్నీళ్లుగా మారిందా. డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఈశ్వర్ సాయిపై మాధురి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయలేదని.. దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని మాధురి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పరిస్థితి చివరికి ఎంత దారుణంగా మారిందంటే.. డోర్ పగలగొట్టి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురిని కుటుంబ సభ్యులు గుర్తించి కాపాడినట్లు చెబుతున్నారు.
ఒకవైపు ప్రేమలో మోసపోయానన్న బాధ.. మరోవైపు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదన.. ఈ రెండు బాధలు కలిసి ఆమెను ఆత్మహత్యాయత్నానికి పురిగొల్పాయా. ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. అంతేకాదు.. ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నాలు నార్సింగి పోలీసులు చేస్తున్నారంటూ మాధురి రాథోడ్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణల్లో నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఇక్కడ మరో కీలకమైన ప్రశ్న కూడా ఉంది.. అసలు ఈశ్వర్ సాయికి అప్పటికే పెళ్లయిందన్న విషయం మాధురికి ముందే తెలుసా.. లేక ఆ విషయం దాచిపెట్టి ఆమెను ప్రేమ పేరుతో నమ్మించాడా. ఈ విషయంలో వాస్తవం ఏంటనేది మాధురి వాంగ్మూలం, పోలీసుల దర్యాప్తు, అందుబాటులో ఉన్న ఆధారాలతోనే తేలాలి.
కానీ మనం సమాజంగా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఈ మధ్య వరుసగా కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తను ప్రియుడి కోసం హత్య చేయడం.. ప్రేమ పేరుతో మోసాలు చేయడం.. నమ్మిన వ్యక్తినే మోసం చేయడం. ఇలాంటి ఘటనలు చూసి మనమే అంటున్నాం.. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇలా తయారైపోయారు. కానీ.. అందరూ ఆడపిల్లలు అలా ఉంటారా. కాదు. తమ ప్రేమను నిజంగా నమ్మే అమ్మాయిలు ఉన్నారు. తమ జీవితాన్ని, తమ భవిష్యత్తును నమ్మిన వ్యక్తి చేతుల్లో పెట్టే అమ్మాయిలు ఉన్నారు. ప్రేమను ఆటగా కాకుండా.. జీవితంగా చూసే అమ్మాయిలు కూడా ఉన్నారు.
అలాంటి నిజమైన మనసున్న అమ్మాయికి.. తప్పు మనిషి ఎదురైతే.. ఆమె పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో మాధురి ఘటన మన ముందు ఒక ప్రశ్నగా నిలుస్తోంది. మన సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో అకాల మరణాలు మనల్ని కలచివేశాయి. దివ్యభారతి.. ఆర్తి అగర్వాల్.. ఇలా ఎందరో మనకు దూరమైనప్పుడు.. వారి మరణం తర్వాత మనం ఎంతో బాధపడ్డాం. వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం.. వారి జీవితాల గురించి మాట్లాడుకున్నాం. కానీ.. ఒక మనిషి చనిపోయిన తర్వాతే అతని బాధ మనకు కనిపించాలా.. బ్రతికుండగానే అతని వేదనకు విలువ ఉండదా.












