నిజామాబాద్, 2026-06-05
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మదక్పల్లి గ్రామంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని భర్త, అత్తలను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే
మదక్పల్లికి చెందిన సోని అనే మహిళ తన వివాహేతర సంబంధానికి భర్త భూమయ్య, అత్త భూదేవ్వ అడ్డు వస్తున్నారని భావించింది. వారిని హత్య చేయాలని పథకం పన్నింది. ఈ క్రమంలో ఇంట్లో వండిన కూరలో గడ్డి మందు కలిపి ఇద్దరికీ భోజనంగా వడ్డించింది.
ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు
భోజనం చేసిన కొద్దిసేపటికే భూమయ్య, భూదేవ్వ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
నిందితురాలి అరెస్ట్
ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు సోనిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు.