*" (ధర్మ రథం) ఆగస్టు 07
నల్గొండలో పగటిపూట జరుగుతున్న వరుస చోరీలతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో, ఖాకీ సినిమా క్లైమాక్స్‌ను తలపించేలా పోలీసులు ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు భారీ షాక్ ఇచ్చారు. ఢిల్లీకి చెందిన కరడుగట్టిన దొంగ మహమ్మద్ నసీమ్ (48)ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.3.25 లక్షల నగదు, ఒక స్కూటీ, చోరీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నల్గొండలో పగటిపూట జరుగుతున్న వరుస చోరీలతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో, ఖాకీ సినిమా క్లైమాక్స్‌ను తలపించేలా పోలీసులు ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు భారీ షాక్ ఇచ్చారు. ఢిల్లీకి చెందిన కరడుగట్టిన దొంగ మహమ్మద్ నసీమ్ (48)ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.3.25 లక్షల నగదు, ఒక స్కూటీ, చోరీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని మరో ఇద్దరు నిందితుల కోసం రాష్ట్రాల మధ్య సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ జి. రమేష్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ ఎ. రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ కె. ఆది రెడ్డి, వన్ టౌన్ ఎస్సై సైదా బాబు ప్రత్యేక వ్యూహంతో రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారం వంటి ప్రతి క్లూను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, పానగల్ బైపాస్ వద్ద ఉచ్చుపన్ని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో, నిందితుడు మహమ్మద్ నసీమ్ నల్గొండలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని ఘజీయబాద్, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో జరిగిన చోరీల్లో తన ప్రమేయాన్ని అంగీకరించాడు. దీంతో ఈ కేసు సంచలన మలుపు తిరిగింది. నిందితుడి వద్ద నుంచి -5--1374 నంబరు గల స్కూటీ, రెండు ఇనుప రాడ్లు, మాస్క్, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాలోని ఇర్షాద్, షరీఫ్ అనే ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రాష్ట్రాల మధ్య సమన్వయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ డి. సైదబాబు, ఎస్ఐ ముత్తయ్య, జి. మానస, పోలీసు సిబ్బంది రబ్బాని, శంకర్, అంజద్, లావూరి బాలకోటి, మహమ్మద్ షకీల్, జానకి రాములు, హోం గార్డ్ శ్రీనులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
చోరీకి వచ్చి పోలీసులకు చిక్కి కటకటాల పాలైన దొంగ వ్యవహారం, నల్గొండ పోలీసుల ఖాకీ సినిమా రేంజ్ ఆపరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.












