వరంగల్, 2026-06-05
ఆర్థిక సమస్యలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తిని సకాలంలో రక్షించి, ఆసుపత్రిలో చేర్చడంలో కీలక పాత్ర పోషించిన మడికొండ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ సంపత్, గోవర్ధన్ లను వరంగల్ పోలీస్ కమీషనర్ శ్వేత రెడ్డి నగదు పురస్కారంతో సత్కరించారు. రెండు రోజుల క్రితం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారిపేట గ్రామ సమీపంలో ఉన్న సాయినాధ్ వెంచర్ వద్ద మెరుగు పవన్ (కరీమాబాద్) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సహసోపేత చర్య
పవన్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంఘటనను గమనించిన కానిస్టేబుల్స్ సంపత్, గోవర్ధన్ వెంటనే స్పందించి, సహసోపేతంగా వ్యవహరించి అతడిని రక్షించారు. అనంతరం సకాలంలో అతడిని ఆసుపత్రిలో చేర్పించి, ప్రాణాపాయం నుండి బయటపడేలా చేశారు.
కానిస్టేబుళ్ల సేవలకు గుర్తింపు
ఈ ఇద్దరు కానిస్టేబుళ్ల అసాధారణ సేవలను గుర్తించిన వరంగల్ పోలీస్ కమీషనర్ శ్వేత రెడ్డి , వారిని నగదు పురస్కారంతో సత్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని తప్పనిసరిగా గుర్తిస్తామని, ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణం కాపాడటం గొప్ప విషయమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
అధికారుల ప్రశంస
ఈ కార్యక్రమంలో వరంగల్ సెంట్రల్ జోన్ దార కవిత, మడికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, లు రాజబాబు, రాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. వారు కూడా కానిస్టేబుళ్ల సేవలను ప్రశంసించారు.