సూరంపేట గ్రామంలో దసరా ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అవతారంలో ఉన్న దుర్గ భవాని మాత ఆవరణంలో హోమం నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంతో పూజలు చేశారు.
దుర్గ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆ భవాని ఆశీస్సులు పొందాలని ఆ మాతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూరం శేషు పాల్ రెడ్డి, అడప ప్రభాకర్, సాయి రెడ్డి, సారంగం, వివేక్ రెడ్డి, మధుకర్, రవిచంద్ర, రాజయ్య, శ్రీకాంత్, దేవేందర్ శివకుమార్, విక్రమ్, కార్తీక్, సాగర్, భరత్ చంద్, రాజేష్ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












