జిల్లా నడిగూడెం మండలం నడిగూడెంలో శ్రీ శిరిడి సాయిబాబా మందిరం 25వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు అనంతరం బాబా వారికి పుష్పాలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబా వారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులయ్యారు.
భజనలు, సత్సంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, స్థానిక సర్పంచ్ దున్న శ్రీనివాస్ హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఆధ్యాత్మికత ఒక భాగం అని పేర్కొన్నారు. రెండు రోజులపాటు ఎంతో ఘనంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించిన కమిటీ సభ్యులను వారు అభినందించారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తాము అన్ని రకాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన దాతలను కమిటీ సభ్యులు సన్మానించారు. తీర్థప్రసాదాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ ఎంతో నిష్ఠతో అభిషేకాలు, పుష్పాలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పందిరి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంతుల కృష్ణయ్య, ఉప సర్పంచ్ ఎలుగూరి నాగరాజు, చిల్లంచర్ల సత్యనారాయణ, గుండు విజయరామారావు, కిషోర్, మండవ వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, భువనగిరి ఉపేందర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.












