రాయికల్ : విద్యార్థుల ఆధార్ నమోదు వివరాల పరిశీలన, ధ్రువీకరణ, నవీకరణ ప్రక్రియలో రాయికల్‌లోని ప్రగతి పాఠశాల 100 శాతం లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని పాఠశాల ఆధార్ ఆపరేటర్ రవీందర్ రావు వెల్లడించారు.
పాఠశాలలో విద్యార్థుల ఆధార్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన వివరాల నవీకరణ ప్రక్రియను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 100 శాతం ప్రక్రియ పూర్తయినట్లు ధ్రువీకరిస్తూ పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆధార్ వివరాలు సక్రమంగా ఉండటం వల్ల ప్రభుత్వ పథకాలు, విద్యా సంబంధిత సేవలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని పేర్కొన్నారు.
ఆధార్ నమోదు, వివరాల పరిశీలన, నవీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో కృషి చేసిన ఆధార్ ఆపరేటర్ రవీందర్ రావును అభినందించారు. విద్యార్థులకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలను పాఠశాలలో ఎప్పటికప్పుడు అమలు చేస్తూ అవసరమైన సేవలను అందిస్తామని తెలిపారు.


