రాజన్న సిరిసిల్ల, 2026-07-25
తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గ్రూప్-, , , , బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, పోలీస్ నియామక పరీక్షలకు ఈ శిక్షణ ఇవ్వబడుతుంది.
తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ సంస్థ (తెలంగాణ స్టడీ సర్కిల్) హైదరాబాద్, రాష్ట్రంలోని 12 టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్-, , , , బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) మరియు పోలీస్ నియామక పరీక్షల కోసం ఉచిత ఫౌండేషన్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోచింగ్ వివరాలు
ఈ కోచింగ్ కార్యక్రమం మొత్తం 125 రోజుల పాటు కొనసాగుతుందని రాజన్న సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి తెలిపారు. ఈ అవకాశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 25-07-2026. దరఖాస్తుల చివరి తేదీ: 14-08-2026. ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 18-08-2026. ధ్రువపత్రాల పరిశీలన: 20-08-2026 నుంచి 24-08-2026 వరకు. కోచింగ్ ప్రారంభం: 25-08-2026.
అర్హతలు
ఈ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలలో రూ. 2.00 లక్షలకు మించరాదు. ప్రస్తుతం రెగ్యులర్ కోర్సు చదువుతున్నవారు, ఉద్యోగంలో ఉన్నవారు మరియు గతంలో బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ పొందినవారు ఈ పథకానికి అనర్హులు.
స్టైఫండ్ మరియు ఎంపిక ప్రక్రియ
ప్రతి నెలా 75 లేదా అంతకంటే ఎక్కువ హాజరు ఉన్న అభ్యర్థులకు 5 నెలల పాటు రూ. 1000/- స్టైఫండ్ (పుస్తక నిధి మరియు రవాణా భత్యంతో కలిపి) మంజూరు చేయబడుతుంది. డిగ్రీలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనలు మరియు స్టడీ సర్కిల్లో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు .... వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.












