కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. అయితే, పన్నెండో తరగతికి చెందిన ఐదు సబ్జెక్టుల పరీక్షలు హోలీ పండుగ రోజైన న నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
సీబీఎస్ఈ 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. అయితే, పన్నెండో తరగతికి చెందిన ఐదు సబ్జెక్టుల పరీక్షలు హోలీ పండుగ రోజైన న నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పండుగ రోజున పరీక్షలు నిర్వహిస్తారా లేదంటే తేదీలను మారుస్తారా అనే చర్చ ప్రస్తుతం మొదలైంది. నాలెడ్జ్ ట్రెడిషన్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండియా, భోటీ, కోక్బొరోక్, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టు కోడ్లు వరుసగా 073, 188, 191, 811, 820. అయితే, ఇప్పటివరకు పరీక్షల తేదీల మార్పుపై సీబీఎస్ఈ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, పదో తరగతి పరీక్షలు న ప్రారంభమై ముగుస్తాయి. పన్నెండో తరగతి పరీక్షలు కూడా న ప్రారంభమై వరకు కొనసాగుతాయి. పరీక్షల తేదీల్లో మార్పులు ఉంటే అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తామని బోర్డు స్పష్టం చేసింది. కాబట్టి, విద్యార్థులు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారమే పరీక్షలకు సిద్ధం కావాలని, తాజా సమాచారం కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని సూచించింది. హోలీ పండుగ రోజున పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, బోర్డు ఈ విషయంలో స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నారు.










