రాయికల్, 6 September
జగిత్యాల జిల్లా మంగత్యా నాయక్ తాండకు చెందిన అక్షర రాథోడ్, నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ సీటు సంపాదించారు. ఈ సందర్భంగా ఆమెను, కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అభినందించారు.
మంగత్యా నాయక్ తాండ గ్రామ పంచాయతీ లోక్యా నాయక్ తండ కి చెందిన భూక్యా రత్తిలాల్ రాజేశ్వరి గార్ల కూతురు అక్షర రాథోడ్ ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించి ఉస్మానియా లో ఎంబీబీఎస్ లో వైద్య విద్య సీటు సాధించి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా అక్షర ను వారి కుటుంబ సభ్యులను అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ గారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్షర సాధించిన ఈ విజయం ఆమె కష్టపడి చదివిన తీరుకు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహానికి నిదర్శనం. మారుమూల తండా ప్రాంతం నుంచి వచ్చి ప్రతిష్టాత్మకమైన వైద్య విద్యలో సీటు సాధించడం ద్వారా అక్షర ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. వైద్య విద్యను పూర్తి చేసి మంచి వైద్యురాలిగా ఎదిగి, పేదలు మరియు సామాన్య ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి జగిత్యాల జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మంగ్త్య నాయక్ తండా గ్రామ ప్రజా ప్రతినిధులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.











