నల్లగొండ (ధర్మ రథం) ఆగస్టు 12
నల్లగొండ జిల్లాలో ఐకాన్ మల్టీ సూర్ స్ెషాలిటీ హాస్ిటల్ పై పై పై డీఎంహెచ్ఓ డాక్టర్ కె.రాహుల్ ఆకస్మిక తనిఖీలు చేట్టారు. ఆసుత్రి వస్తున్న వరుస ఫిర్యాదుల నేథ్యంలో వద్య ఆరోగ్యశాఖ తిరిగిన తిరిగిన అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. అధిక బిల్లులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల రికార్డులను రిశీలించారు.
నల్లగొండ జిల్లాలో ఐకాన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై డీఎంహెచ్ఓ డాక్టర్ కె.రాహుల్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిపై వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. అధిక బిల్లులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై రికార్డులను పరిశీలించారు.
కీలక రికార్డుల స్వాధీనం
ఆసుపత్రిని పూర్తిగా కలియ తిరిగిన అధికారులు పలు కీలక రికార్డులు, బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. అధిక బిల్లులకు సంబంధించిన కొన్ని బిల్లులను నమూనాలుగా తీసుకున్నారు. బిల్లులు, వైద్య రికార్డులు, కేస్షీట్లను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.
191 మరణాలపై విచారణ
గత మూడేళ్లలో ఆసుపత్రిలో 191 మంది మృతి చెందినట్లు రికార్డులు వెల్లడించాయి. ఈ మరణాలకు సంబంధించిన కేస్షీట్లను సేకరించిన అధికారులు, మరణాలకు కారణాలపై లోతైన విచారణ చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు తరలింపుపై ఆరా
ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి రోగులను తరలిస్తున్నారనే ఫిర్యాదులపై కూడా అధికారులు ఆరా తీశారు. బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో రోగులను ప్రభుత్వ ఆసుపత్రికి పంపుతున్నారనే ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను సైతం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వైద్యుల అర్హతలపై తనిఖీలు
ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల అర్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలపై కూడా తనిఖీలు చేశారు. గతంలో అనుమతులు ఇచ్చిన సమయంలో ఉన్న వైద్యులు ప్రస్తుతం లేరని, వారి స్థానంలో పనిచేస్తున్న వైద్యుల సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ వివరాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల వైద్యులు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారనే సమాచారంపై కూడా విచారణ చేపట్టారు.
కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.రాహుల్ స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే ఆసుపత్రిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.












