జగిత్యాల పట్టణ అభివృద్ధికి చేపడుతున్న పనులకు ప్రజలు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ కోరారు. శుక్రవారం ధరూర్ క్యాంప్‌లో మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌తో కలిసి ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు. రామాలయం నుంచి మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల వరకు నిర్మిస్తున్న నూతన రహదారి పనులను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న బీటీ రహదారులను నాణ్యతతో పునరుద్ధరించాలని ఆదేశించారు. కొత్త బస్టాండ్‌లో నిర్మిస్తున్న నూతన తాగునీటి ట్యాంకు, పైప్‌లైన్ పనులను కూడా పరిశీలించారు. ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందేలా పనులను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించడం బాధాకరమన్నారు. ప్రజల సహకారంతో జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. మున్సిపల్ పరిధిలోని దుకాణ సముదాయాల అద్దెలను మార్కెట్ విలువ ఆధారంగా సమీక్షించాలని కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. అద్దెలు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, ఆర్బీడీఈ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, కో-ఆప్షన్ సభ్యుడు గట్టు సతీష్, ఎస్సీ జిల్లా అధ్యక్షుడు దుమల రాజ్‌కుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల అభివృద్ధికి సహకరించండి - ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Share:

సారాంశం
ధరూర్ క్యాంప్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులకు సూచనలు
ముఖ్య విషయాలు
- జగిత్యాల పట్టణ అభివృద్ధికి చేపడుతున్న పనులకు ప్రజలు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.
- శుక్రవారం ధరూర్ క్యాంప్‌లో మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌తో కలిసి ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు.
- రామాలయం నుంచి మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల వరకు నిర్మిస్తున్న నూతన రహదారి పనులను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
- కొత్త బస్టాండ్‌లో నిర్మిస్తున్న నూతన తాగునీటి ట్యాంకు, పైప్‌లైన్ పనులను కూడా పరిశీలించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bale Nikhil Kumar
Reporter
Jagtial
52ఆర్టికల్స్
3,990వ్యూస్






