ప్రజావాణి ద్వారా ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదులు, వినతులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుండి అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతాయుతంగా తీసుకొని, సంబంధిత సమస్యపై సమగ్ర విచారణ జరిపి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజావాణి ద్వారా అందిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
62 ఫిర్యాదుల స్వీకరణ
ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 62 ఫిర్యాదులు, వినతులు అందాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకొని పరిష్కరించాలని సూచించారు.
ప్రజావాణి ద్వారా అందిన ప్రతి దరఖాస్తును అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో పాటు దరఖాస్తుదారులకు తగిన సమాచారం అందించాలని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె. వై ప్రసాద్, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.












