సిరిసిల్ల, 21 September
రాజన్న జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 172 దరఖాస్తులు అందాయి. ఈ అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, ప్రజలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

ప్రజావాణిలో భాగంగా ఆర్డీఓ కార్యాలయానికి 8, వేములవాడకు 10 దరఖాస్తులు అందాయి. జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో 59 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.