భారతదేశం (ధర్మ రథం) సెప్టెంబర్ 17
యూపీఐ () చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా () మరియు కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేశాయి. రూ. 2,000 లోపు చెల్లింపులు పూర్తిగా ఉచితం కాగా, వ్యాపారులకు చేసే పెద్ద చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ () వర్తిస్తుంది. అయితే, ఈ భారం వినియోగదారులపై పడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
యూపీఐ () చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా () మరియు కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేశాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సాధారణ వినియోగదారులు చేసే రూ. 2,000 లోపు యూపీఐ చెల్లింపులపై ఎలాంటి బ్యాంక్ ఛార్జీలు ఉండవు. ఇది పూర్తిగా ఉచితం. అలాగే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి (2 - ) జరిపే నగదు బదిలీలపై ఎటువంటి ఛార్జీలు వర్తించవు.
అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు ఒకే రకమైన విధానం కాకుండా, కొన్ని రంగాలకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించారు. రైల్వే టికెట్లు, ఇంధనం (పెట్రోల్/డీజిల్), బీమా ప్రీమియంలు మరియు ఎలక్ట్రిసిటీ, వాటర్ వంటి యూటిలిటీ బిల్లుల చెల్లింపులు రూ. 2,000 దాటితే శాతంతో సంబంధం లేకుండా కేవలం ఫ్లాట్ రూ. 5 మాత్రమే ఛార్జీ వర్తిస్తుంది. ఇది కూడా వ్యాపారులకే వర్తిస్తుంది. నెలకు రూ. 1 లక్ష వరకు టర్నోవర్ ఉండే చిన్న వ్యాపారులు, రోడ్డు పక్కన ఉండే వీధి వ్యాపారులు ( ) అందుకునే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండవు (జీరో ).
మ్యూచువల్ ఫండ్స్, షేర్లు మరియు సెక్యూరిటీల కొనుగోళ్ల కోసం జరిగే యూపీఐ చెల్లింపులపై కేవలం 0.02 మాత్రమే ఛార్జీ ఉంటుంది (దీని గరిష్ట పరిమితి కూడా రూ. 300). డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, భద్రతను పెంచడానికి మరియు సర్వీసులను నిరంతరం మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం మరియు ఎన్పీసీఐ స్పష్టం చేశాయి. సాధారణ యూజర్లకు రోజువారీ లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని, 95 శాతానికి పైగా లావాదేవీలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.












