డెంగీ వైరస్‌పై పోరాటంలో కీలక ముందడుగు పడింది. జపాన్‌కు చెందిన తకేడా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌కు భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ () మార్కెటింగ్ అనుమతి మంజూరు చేసింది. దీంతో 2027 ప్రారంభంలో ఈ టీకా భారతదేశంలోకి అందుబాటులోకి రానుంది.
డెంగీ వైరస్‌పై పోరాటంలో ఇది కీలక ముందడుగు. జపాన్‌కు చెందిన తకేడా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌కు భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ () మార్కెటింగ్ అనుమతి మంజూరు చేసింది. దీంతో 2027 ప్రారంభంలో ఈ టీకా భారతదేశంలోకి అందుబాటులోకి రానుంది. సరఫరా కోసం తకేడా, డాక్టర్ రెడ్డీస్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ టీకా రెండు డోసులను మూడు నెలల వ్యవధిలో ఇవ్వనున్నారు. డెంగీ స్క్రీనింగ్ అవసరం లేకుండానే ఈ టీకాను తీసుకోవచ్చు. ప్రస్తుతం డెంగీ నివారణకు నిర్దిష్టమైన చికిత్స అందుబాటులో లేదు. లక్షణాల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే డెంగీ నివారణలో గణనీయమైన మార్పులు వస్తాయని వైద్య నిపుణులు ఆశిస్తున్నారు. ఇది డెంగీ వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.










