ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో, ఐఎంఏ భవన్లో డొనేట్ బ్లడ్ సేవ్ లైవ్స్ కార్యక్రమంలో భాగంగా 25వ రక్తదాన శిబిరాన్ని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలు, ప్రసూతి, రక్తానికి సంబంధించిన వ్యాధులు వంటి సమయాల్లో ఆపదలో ఉన్నవారికి రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
ఐఎంఏ సేవలకు అభినందన
రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిరంతరం శిబిరాలు నిర్వహిస్తున్న ఐఎంఏ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. మానవ సేవ మాధవ సేవగా అందరూ భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ శ్రీనివాస్, ఐఎంఏ సెక్రటరీ అకుతోట శ్రీనివాసరెడ్డి, కోశాధికారి డా.సుధీర్, కౌన్సిలర్ ప్రశాంత్ రావు, డా.నాగరాజు, డా.శంకర్, డా.కృష్ణ మూర్తి, విమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, వైద్యులు, నాయకులు, ఐఎంఏ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.










