సూర్యాపేట జిల్లా మండలంలోని చాకిరాల గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన 360 పనులను గుర్తించి, వాటిని ప్రజల లబ్ధికి అనుగుణంగా అమలు చేయాలని అధికారులు సూచించారు.
చాకిరాల గ్రామంలో జరిగిన ఈ గ్రామసభకు సర్పంచ్ మొగలగాని రమ్య నాగేంద్రబాబు అధ్యక్షత వహించారు. పంచాయతీ సెక్రెటరీ సురేందర్, సంఘ బంధం అధ్యక్షురాలు నోముల లచ్చమ్మ, సంఘ బంధం కార్యదర్శి మొగలగాని వాణి, ఫీల్డ్ అసిస్టెంట్ సులోచన, ఆశ వర్కర్ మాతంగి ఉషారాణి, అంగన్వాడి టీచర్ మోరగాని రేణుక, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల ప్రాముఖ్యతను, వాటి ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ వివరించారు. గుర్తించిన 360 పనులను ప్రజల లబ్ధికి అనుగుణంగా అమలు చేయాలని సూచించారు. గ్రామసభలో ఇంకుడు గుంతల నిర్మాణం, చెరువు పూడిక, క్యాటిల్ షెడ్ల నిర్మాణం, బాత్రూమ్ల నిర్మాణం, చాపల చెరువులో నిర్మాణం, పాత బోర్లు మరమ్మతులు, పాత రాళ్లబావుల పూడిక, కోళ్ల షెడ్ల నిర్మాణం వంటి వివిధ రకాల పనులను గుర్తించారు. ఈ పనులన్నింటినీ సమర్థవంతంగా పూర్తి చేయడం ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని తీర్మానించారు.












