జగిత్యాల, 23 September
జగిత్యాల పట్టణంలో మొదటి రోజు గణేష్ నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. మహిళల మంగళ హారతులు, యువతుల నృత్యాలతో పుర వీధుల గుండా గణేష్ శోభాయాత్ర సాగింది. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
పట్టణంలో మొదటి రోజు గణేష్ నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. మహిళల మంగళ హారతులు, యువతుల నృత్యాలతో పుర వీధుల గుండా గణేష్ శోభాయాత్ర సాగింది. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా నిర్వహిస్తున్న పోలీసులు, 700 మంది అధికారులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చింతకుంట చెరువు వద్ద గంగమ్మ ఒడిలోకి గణనాధులు చేరుకున్నారు. ఓ బొజ్జ గణపయ్య... వెళ్ళి రావయ్యా అంటూ గణేశుల నిమజ్జనం జరిగింది.












