తంగళ్లపల్లి, 23 September
మండల కేంద్రంలో 9వ పోషణ మాసం సందర్భంగా మన అంగన్వాడీ మన బాధ్యత నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా, గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులకు పోషణ మాసం ప్రాముఖ్యతను వివరించారు.
మండల కేంద్రంలో 9వ పోషణ మాసం సందర్భంగా మన అంగన్వాడీ మన బాధ్యత నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా, గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులకు పోషణ మాసం ప్రాముఖ్యతను వివరించారు. పోషణ మాసం సందర్భంగా, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, బెల్లం, నువ్వులు, బాలామృతంతో సిద్ధం చేసిన ఆహార పదార్థాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ప్రతి మంగళవారం 10 నిమిషాలు కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని సూచించారు. కేంద్రాల సేవలు, వసతులు మెరుగుపరచడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ తదితర అంశాలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి నెలా తల్లిదండ్రులు బాధ్యతగా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లి, వారి ఎత్తు, బరువు నమోదు చేయించాలని, దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించడం ద్వారా వారి బంగారు భవితకు బాటలు వేయవచ్చని స్పష్టం చేశారు.
పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ
ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు నమోదు చేయడంతో, వారికి అంగన్వాడీ కేంద్రంలో బాలామృతంతో పాటు ఇతర పోషకాహార పదార్థాలు అందిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం పంపించడం వల్ల పిల్లలకు పోషకాహారం అందుతుందని, ఆట, పాటలు, బొమ్మల ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తారని వివరించారు. తీవ్రమైన పోషకాహార లోపం, మధ్యస్థ తీవ్ర పోషకాహార లోపం, తీవ్రమైన తక్కువ బరువు, మధ్యస్థ తక్కువ బరువు ఉన్న పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ వహించి, అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తారని వివరించారు. సూపర్వైజర్లు, సీడీపీఓలు తమ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు చేయాలని సూచించారు.
తల్లిదండ్రుల బాధ్యత, బాలల ఆరోగ్యం
పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు తల్లిదండ్రుల ఇద్దరి బాధ్యత అని పేర్కొన్నారు. బాలల మొదటి వెయ్యి రోజుల దశ కీలకమని, వారికి ఇంట్లో సైతం సరైన పోషకాహారం ఇవ్వాలని సూచించారు. చక్కెర పదార్థాలు ఇవ్వకూడదని తెలిపారు.
గర్భిణులు, బాలింతలు, మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.










