Jagtial/Jagtial (ధర్మ రథం) నవంబర్ 18
జగిత్యాల పట్టణంలో 969 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ గారు పంపిణీ చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో 969 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వు పత్రాలను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ గారు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, ఫైలేరియా బాధితులకు చేయూత పెన్షన్లు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని తెలిపారు. అతి త్వరలో అర్హులందరికీ చేయూత పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, సొంతింటి కలను సాకారం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల పట్టణ అర్బన్ హౌసింగ్ కాలనీలో డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రజలు తడి, పొడి చెత్తను వేరుగా ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వ పథకాలతో పాటు, నూతన పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు.
గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమని, గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన అన్నారు. 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రయోజనం కలుగుతుందని, ఇందిరమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి దీనిని ప్రకటిస్తారని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో జగిత్యాల నియోజకవర్గాన్ని ముందుంచే విధంగా నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు.
అర్హులై ఉండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పెన్షన్లు అందనివారు కలెక్టరేట్ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్‌ను సంప్రదించి వివరాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, మున్సిపల్ వైస్ చైర్మన్ జీనత్ పర్వీన్ మున్నా, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, పట్టణ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







