రాయికల్, 14 September
మండలం అల్లీపూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అల్లీపూర్ గ్రామానికి చెందిన ఉషోదయ యూత్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. డప్పు, సన్నాయి వాయిద్యాల మోతలు, మంగళవాయిద్యాల నడుమ గణనాథుడిని మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు.
మండలం అల్లీపూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అల్లీపూర్ గ్రామానికి చెందిన ఉషోదయ యూత్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా డప్పు సన్నాయి వాయిద్యాల మోతలు, మంగళవాయిద్యాల నడుమ ఉషోదయ యూత్ సభ్యులందరూ కలిసి గణనాథుడిని మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. ఈ కార్యక్రమంలో ఉషోదయయూత్ సభ్యులతో పాటు, గ్రామ చిన్నారులు, ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు...












