మండలం కిష్టంపేట గ్రామ మెయిన్ రోడ్డులో పనిచేయని ఐమాక్స్ లైటు సమస్యపై ధర్మరథం దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామ సర్పంచ్, సెక్రెటరీ చొరవతో బుధవారం లైటుకు మరమ్మత్తులు చేయించారు.
కిష్టంపేట గ్రామ మెయిన్ రోడ్డులో ఐమాక్స్ లైటు పనిచేయడం లేదని ఈ నెల 10వ తేదీ గురువారం ధర్మరథం తెలుగు దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన అధికారులు, బుధవారం గ్రామ సర్పంచ్ ఆకుల అంజ గౌడ్, సెక్రెటరీ ప్రతిభ ప్రత్యేక చొరవతో సదరు లైటుకు మరమ్మత్తులు చేయించారు. సమస్యను వెంటనే పరిష్కరించిన గ్రామ సర్పంచ్, సెక్రెటరీ, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకు కిష్టంపేట గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం, అధికారుల సత్వర స్పందనతో సమస్య పరిష్కారమైందని గ్రామస్తులు తెలిపారు.












