గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పెద్దకోడెపాక గ్రామంలోని కురుమవాడ హనుమాన్ టెంపుల్ వద్ద సామాజిక సేవకులు అమ్మ అశోక్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పెద్దకోడెపాక గ్రామంలోని కురుమవాడ హనుమాన్ టెంపుల్ వద్ద సామాజిక సేవకులు అమ్మ అశోక్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
అనంతరం భక్తులు, గ్రామ ప్రజల సమక్షంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి, ప్రతి ఒక్కరికీ అన్నప్రసాదం అందించారు.
ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అమ్మ రాజు, ముజిగిరి వేణు, కొమ్ము శ్రీను, అమ్మ రంజిత్, అన్న రాజు, చంద్రమౌళి, మహేష్, రాకేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.












