రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాపన్న గౌడ్ సేవలను కొనియాడారు. కుల సంఘాల బలోపేతానికి, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌడ సంఘంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జన గణన తో పాటు కుల గణన చేసిన రెండవ రాష్ట్రం తెలంగాణ అని, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి సహకారం తో కుల సంఘాల బలోపేతానికి, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
కాటమయ్య రక్షణ కిట్లు గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష అని అన్నారు. గీతా కార్మికుల పెన్షన్ పథకం అర్హులు అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈత తాటి మొక్కలు నాటడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రెండు ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయని, బీద, మధ్యతరగతి రైతులు, ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మెన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, వైస్ చైర్మన్ సౌజన్య శ్రీధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుతరావు, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రావు, కోల శ్రీనివాస్, రాజి రెడ్డి, రాయికల్ పట్టణ, మండల నాయకులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గౌడ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.












