ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్‌ను జిల్లా టీఎన్జీవో సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్‌ను జిల్లా టీఎన్జీవో సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్‌ను కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అజహరుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా అధ్యక్షులు ఎం.డి. వకీల్, టీఎన్జీవో జిల్లా నాయకులు ఎం.డి. మహమూద్, సాహెద్ బాబు, అల్లె రాజేందర్, సి.హెచ్. రాములు, కైతోజు సుగుణాకర్, ఎనుగంటి రాజేశం, ఎం.ఏ. హకీమ్, పట్నం హరి ప్రసాద్, శ్రీనివాస్, మమత, శైలజ, శ్రావణి, ఇంద్రజ, విజయలక్ష్మి, ఆమని, పవిత్ర, గౌసోద్దీన్, శ్రీకాంత్, సత్యనారాయణ, రమేష్, గణేష్, నాల్గవ తరగతి ఉద్యోగుల అధ్యక్షురాలు అరుణ, నారాయణ, సతీష్‌తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.








