ధర్మారం ఎస్సీ కాలనీలోని ఎల్లమ్మ టెంపుల్ ప్రాంగణంలో గణేష్ మండపం వద్ద టీమ్ బిగ్ బుల్స్ యూత్ సభ్యులు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. గిద్దె సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు.
ధర్మారం ఎస్సీ కాలనీలోని ఎల్లమ్మ టెంపుల్ ప్రాంగణంలో గణేష్ మండపం వద్ద అన్నదానం నిర్వహించారు. ధర్మారం టీమ్ బిగ్ బుల్స్ యూత్ సభ్యులు, గిద్దె సురేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని వినాయక మండపం వద్ద ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరమాల సుమలత, మల్లేశం, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు, చిన్నారులు పాల్గొన్నారు. యూత్ సభ్యులు మేకల శ్రీనివాస్, చింతల రాకేష్, చింతల ప్రవీణ్, గిద్దె అభి, చింతల శ్రీనివాస్, గిద్దె బన్నీ, గిద్దె పృథ్వీరాజ్, గిద్దె వినయ్, పూదరి సాయి చందు, చింతల మల్లికార్జున్, చింతల తిరుపతి, చింతల రమేష్ పాల్గొన్నారు.












