వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేల అధిక శబ్దంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఒక పౌరుడు ఆవేదన వ్యక్తం చేశారు. సామూహిక మైకుల ధ్వనులకు గుండెలు, కర్ణ భేరులు పగిలిపోతున్నాయని, రహదారులు దద్దరిల్లుతున్నాయని, లేత గుండెలు రాలిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.
చిట్టెలుక వాహనమెక్కి చెరువులో మునిగేందుకు వెళ్లే వినాయకుడి ఊరేగింపులో భూగోళమంతా బద్దలయ్యేలా డీజేల ఘోష అవసరమా అని ప్రశ్నించారు. ఈ డీజే ధ్వనులను భరించలేకపోతున్నామని తెలిపారు. బ్యాండ్ మేళాలను బ్యాన్ చేసి, నవరాత్రులకు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు డీజే సౌండ్స్ వాహనాలను ఉపయోగిస్తున్నారని, దీనివల్ల యువత మత్తులో పడి జగతినే మరచిపోతున్నారని ఆయన అన్నారు. ఈ డీజే సౌండ్స్ ను నిషేధించి, సంప్రదాయ మేళాలతో ఊరేగించేలా కొత్త చట్టాలు తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆబాలగోపాలాన్ని కాపాడేందుకు ఈ చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జి.సూర్య అనే పౌరుడు తన అభిప్రాయాలను, సూచనలను తెలియజేశారు. ఆయన సెల్ నంబర్ 6281725659.












