తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాలు కొనసాగుతాయని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం (టీఎంజేఎఫ్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ తెలిపారు. హైదరాబాద్లోని కోఠి బీసీ సాధికారిక భవన్లో జరిగిన ఫోరం రాష్ట్ర నూతన కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడిటేషన్ కార్డులు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని బూర్గుల నాగేందర్ మాదిగ డిమాండ్ చేశారు. మాదిగ జర్నలిస్టులకు ఎస్సీ కమిషన్ లో ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, ఫోరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా వత్తుల రఘుపతి, గౌరవ సలహాదారులుగా పాల్వాయి బాలయ్య, జీలకర్ర కృష్ణకర్, ప్రేమ్ కుమార్, తిరుపతి, సుంచు లింగయ్య ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా బూరుగుల నాగేందర్, ప్రధాన కార్యదర్శిగా బొల్లెపాక రాజేష్, అధికార ప్రతినిదిగా పంగిడి చెరువు వెంకటేష్, కోశాధికారిగా సదానందం ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా పానుగంటి సురేందర్, సుక్క అశోక్, అంకగళ్ల కరుణాకర్, పెండ్యాల సుమన్, దుబ్బ నాగేష్, కాటేపాక హుస్సేన్, పెద్దింటి శ్రీనివాస్, కడియం నాగయ్య; కార్యదర్శులుగా సర్వని శ్రీనివాస్, ఒగ్గు సోమయ్య, ఏర్పుల మహేష్, గంట వెంకన్న, నాగేశ్వరరావు, కుమ్మరి ముఖేష్, చల్మెడ అనిల్, అడిగమోహన్, శ్రీమన్నారాయణ, గూడూరు కరుణాకర్, బిక్షపతి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కేశపాగ శ్రీను, వంగాల అవినాష్, జయరాజు, మంచాల అనిల్, మహారాయుడు, పూర్ణచందర్, జింక శ్రీధర్, బొల్లె రాజన్న, చదలవాడ సూరి, గోవిందు, గంగరాజు తదితరులు ఎన్నికయ్యారు. ఈ నూతన కమిటీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఫోరం ప్రతినిధులు తెలిపారు.












