మండలం కాకునూరు గ్రామానికి చెందిన అనుపటి కృష్ణ (36) అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే ఆయన, మధుమేహం కారణంగా చూపు కోల్పోయి, కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో మంచాన పడ్డారు. దీంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది.
మండలం కాకునూరు గ్రామానికి చెందిన అనుపటి కృష్ణ (36)కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కష్టపడి పనిచేసి ఒక ట్రాక్టర్ ను కూడా సొంతం చేసుకున్నాడు. సాఫీగా సాగుతున్న సంతోషకరమైన జీవితంలో ఒక పీడ వారి సంతోషాన్ని అడ్డుకుంది. సుమారు సంవత్సరం క్రితం కృష్ణకు మధుమేహం (షుగర్) వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా ఆయన రెండు కళ్లూ కోల్పోయాడు. అంతేకాక, మధుమేహం కారణంగా కిడ్నీలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఆయన మంచాన పడ్డాడు. కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తి అనారోగ్యంతో మంచాన పడడంతో ఆ కుటుంబం జీవనం దయనీయంగా మారింది. చూపు కోల్పోవడం, సొంతంగా నడవలేకపోవడం వంటి కారణాలతో, మంచిగా ఎదుగుతున్న చిన్నతనంలోనే ఈ సమస్యల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ప్రతి రెండు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. దీంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది.
ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడానికి కూడా తగినంత ఆర్థిక స్తోమత లేని పరిస్థితి నెలకొంది. కావున దాతలు, దయగల హృదయులు దయతలచి తమ వంతు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాతలు ఆర్థిక సహాయం అందించాల్సిన ఫోన్ పే నంబర్: 63023 85725










