కోరుట్ల పట్టణంలో నవజ్యోతి స్కూల్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించారు. అనంతరం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా చేపట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన వినాయకుని విగ్రహం వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
గణపతి బప్పా మోరియా బోలో గణపతి బప్పా మోరియా అంటూ భక్తుల నినాదాలతో పరిసర ప్రాంతం మార్మోగింది.
విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, భక్తి గీతాలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు మరింత శోభను తెచ్చారు. డప్పుల మోతలు, భక్తుల నినాదాలు, ఉత్సాహభరితమైన వాతావరణంతో నిమజ్జన వేడుకలు కన్నులపండువగా సాగాయి.
ఈ సందర్భంగా నవజ్యోతి స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ, వినాయక చవితి పండుగ విద్యార్థుల్లో భక్తితో పాటు ఐక్యత, క్రమశిక్షణ, సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
విఘ్నాలను తొలగించి, విద్యార్థులకు మంచి విద్య, జ్ఞానం, ఆరోగ్యం, విజయాలను ప్రసాదించాలని శ్రీ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, నవజ్యోతి స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా ముగిశాయి.
గణపతి బప్పా మోరియా మంగళమూర్తి మోరియా












