గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో ట్రాన్స్జెండర్లను భాగస్వామ్యం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ వినూత్న ముందడుగు వేసింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఆధ్వర్యంలో 17 మంది ట్రాన్స్జెండర్లకు టీ-షర్ట్లను అందజేశారు. సమానత్వం, గౌరవం, వివక్ష రహిత వాతావరణాన్ని ప్రోత్సహించడమే దీని లక్ష్యం.
గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిమజ్జనోత్సవ బందోబస్తులో, ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో ట్రాన్స్జెండర్లను భాగస్వామ్యం చేసే అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ తెలిపారు. సమానత్వం, గౌరవం, వివక్ష రహిత వాతావరణానికి పోలీసుల వినూత్న ముందడుగు ఇది.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించిన ఎస్పీ, గణేశ్ నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించనున్న 17 మంది ట్రాన్స్జెండర్లకు టీ-షర్ట్లను అందజేశారు.
అనంతరం, వారికి విధుల నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు, మార్గదర్శకాలను అందించారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ట్రాన్స్జెండర్లకు గౌరవం కల్పించడంతో పాటు, పోలీసు శాఖలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి పోలీసు శాఖ అండగా నిలుస్తుందని, వారిని సమాజంలో సమానంగా చూసేందుకు కృషి చేస్తోందని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడానికి ట్రాన్స్జెండర్ల సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












