కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ఆధ్వర్యంలో సంత అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గతంలో దళారుల బెదిరింపులు, అవినీతితో సతమతమైన సంత, నేడు పారదర్శక పాలనతో కళకళలాడుతోంది. రైతులకు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, సంత ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపడుతున్నారు.
గతంలో వెలవెలబోయిన కోదాడ సంత నేడు కళకళలాడుతోంది. మార్కెట్ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ తనదైన శైలిలో సంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, దళారులకు అడ్డుకట్ట వేయడంలో సక్సెస్ అయ్యారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సింప్లిసిటీతో తన వంతుగా సంత అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు.
చైర్మన్ తిరుపతమ్మ సుధీర్ స్వయంగా చెక్ పోస్ట్ వద్దకు వెళ్లి రికార్డులను పరిశీలిస్తున్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ, సంతలో ఎక్కడా అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నియామకం వెనుక కారణాలు
నీతి నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశంతో, కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి, నిజమైన పార్టీ కార్యకర్తకు, చదువుకున్న మహిళకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో, స్థానిక శాసనసభ్యులు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, పార్టీ కష్టకాలంలో మండలంలో పార్టీని ముందుండి నడిపించిన, కరుడుగట్టిన పార్టీ విధేయురాలైన వేపూరి తిరుపతమ్మ సుధీర్లకు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు.
అప్పటినుండి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలనే సంకల్పంతో, సంత అభివృద్ధి కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ముందుగా సంతలోని లోటుపాట్లను తెలుసుకొని, రైతులకు, వ్యాపారస్తులకు అందుబాటులో ఉంటూ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన వంతుగా సంత అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు చైర్మన్ తిరుపతమ్మ సుధీర్.
గతంతో పోలిస్తే నేటి మార్పులు
గత 10 సంవత్సరాలకు ముందు, ఈ పదవిలోకి రాకముందు, దళారులు పిసి వసూలు అంటూ వ్యాపారస్తులను, రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. సంత అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న సంతను, నేడు తాగునీటికి ఇబ్బందులు లేకుండా, పరిశుభ్రంగా ఉంచుతూ, దందాలు, బెదిరింపులు, పిసి వసూలు లేకుండా చేశారు. నేరుగా రైతులు, వ్యాపారస్తులు సంతకు వచ్చి కొనుగోళ్లు, అమ్మకాలు చేసుకునే విధంగా, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వయంగా వారితో, పాలకవర్గ సభ్యులతో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రహదారులకు చెక్ పోస్టుల వద్ద వసూళ్ల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ రైతులతో, వ్యాపారస్తులతో శభాష్ అనిపించుకుంటున్నారు. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారస్తుల వాహనాల చెక్ పోస్టుల వద్ద ఎలాంటి అవకతవకలు జరగకుండా స్వయంగా రాత్రింబవళ్లు తనిఖీలు చేస్తూ, సంత ఆదాయానికి గండి పడకుండా తన అభివృద్ధి మార్క్ చూపిస్తూ, సింప్లిసిటీతో, ఎలాంటి ఆర్భాటాలు చేయకుండా సంత ఆదాయాన్ని పెంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు మహిళా చైర్మన్ వేపూరి తిరపతమ్మ సుధీర్. పాలకవర్గ సభ్యులు, సంబంధిత సిబ్బంది సహకారంతో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.












