జగిత్యాల జిల్లాలో సెర్ప్ () కార్యక్రమాలను విజయవంతం చేయడానికి జిల్లా మహిళా సమాఖ్య కృషి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి యం. రఘువరణ్ సూచించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా సమాఖ్య కార్యవర్గ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు.
జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో, అధ్యక్షురాలు యన్. ఆమనీ, కార్యదర్శి రజిత, కోశాధికారి వి. రూప కళ, జిల్లా డి.ఆర్.డి.ఓ. యం. రఘువరణ్, అదనపు డిఆర్డీఓ సునీతలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ, జిల్లాలో 18 మండల సమాఖ్యలు, 565 గ్రామ సమాఖ్యలు, 15,466 స్వశక్తి సంఘాలు, 1,80,234 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు.
ప్రభుత్వం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన వడ్డీ లేని రుణాలు, వివిధ రకాల ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు, మార్కెటింగ్, ఫామ్, నాన్-ఫామ్ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పథకాలను మహిళా సంఘాల సభ్యులకు సమర్థవంతంగా అందేలా చూడాల్సిన బాధ్యత సెర్ప్ సిబ్బందితో పాటు జిల్లా సమాఖ్యపై కూడా ఉందని, వారు చురుగ్గా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ పి. సునీత, డిపిఎంలు రమేష్, నారాయణ, నాగేశ్వర్ రావు, ఏపిఎం వి. గంగాధర్, త్రివేణి, హుస్సేన్, శ్రీనివాస్, సీసీలు సత్యం, రాజు, జిల్లా సమాఖ్య సిబ్బంది భాగ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.







