సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు. అసత్య ప్రచారాలు షేర్ చేసినా, ఫార్వర్డ్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
రాజన్న జిల్లాలో సోషల్ మీడియా వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా పోస్టులు పెట్టినా, అసత్య ప్రచారాలు షేర్ చేసినా, ఫార్వర్డ్ చేసినా కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే హిస్టరీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు.
ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా, ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేయడం, పోస్టులు పెట్టడం, ఫార్వర్డ్ చేయడం చేయవద్దని ఆయన సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘించి పోస్టులు పెట్టినా లేదా ఫార్వర్డ్ చేసినా, అడ్మిన్లతో సహా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని డీఎస్పీ నాగేంద్రచారి స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు.











