తెలంగాణలోని అన్ని జిల్లాల ఖాతాల్లో డబ్బులు జమ అయినప్పటికీ, భూపాలపల్లి నియోజకవర్గం మండలంలోని బీఎల్వోలకు రావాల్సిన గౌరవ భృతి, అంటే సంవత్సర కాలానికి పన్నెండు వేల రూపాయలు ఇప్పటికీ తమ ఖాతాల్లో జమ కాకపోవడం చాలా బాధాకరమని బీఎల్వోల సంఘం గౌరవ అధ్యక్షులు వంగీటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
సమగ్ర ఓటర్ సవరణ (సర్) ప్రోగ్రాం లో భాగంగా ఈ భృతి చెల్లించాల్సి ఉందని, ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ జాప్యం వల్ల బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు కే జోష్న, ప్రధాన కార్యదర్శి అమ్మ కల్పన, కోశాధికారి తడక భాగ్య లక్ష్మి, బీఎల్వోలు వజ్రా శ్వేత, సదానందం, తులసి రత్నమాల తదితరులు పాల్గొన్నారు. వారు తమ సమస్యలను సంఘం నాయకత్వానికి వివరించారు.







