వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల హర్షధ్వానాలు, మంగళవాయిద్యాలు, డీజే పాటల నడుమ గణనాథుడి శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూత్ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించినట్లు తెలిపారు. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన భక్తులకు, యువతకు, మహిళలకు, స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో రాజేంద్రనగర్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
నిమజ్జనోత్సవంలో శ్రీ వెంకటేశ్వర యూత్ సభ్యులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, రాజేంద్రనగర్ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాస్, వేముల రామకృష్ణ, విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల శేఖర్, దండుగల శ్రీనివాస్, కొమేర శంకర్, గుంజ రాజు, గుంజా మధుసూదన్, మన్నె రాజు, దండుగల బాబుతో పాటు రాజేంద్రనగర్ వడ్డెర సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, యువత, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.