మధిరలో నిర్మాణంలో ఉన్న నూతన బస్టాండ్ పనులను కరీంనగర్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలమన్ శుక్రవారం పరిశీలించారు. ఆయనతో పాటు ఖమ్మం రీజినల్ మేనేజర్ . సరిరామ్, . () . రాజేశ్వర్ రెడ్డి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మధిర ఆర్టీసీ డిపోను సందర్శించిన జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలమన్ డిపోలోని ఆదాయ వ్యయాల వివరాలను పరిశీలించారు. డిపో పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆదాయం పెంపు, ఖర్చుల నియంత్రణ, సంస్థకు మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగిన ఆదేశాలు, సూచనలు ఇచ్చారు.
డిపో నిర్వహణ, బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, ఆదాయాన్ని పెంచే అవకాశాలపై కూడా అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా డిపో మేనేజర్, అధికారులు, సిబ్బంది జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి డిపో పరిస్థితులు, సమస్యలు, అవసరాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో మధిర డిపో మేనేజర్ . దేవరాజు డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












