ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతంగా , సీజనల్ వ్యాధులు, ఇమ్యూనైజేషన్, ఎన్ సీ డీ స్క్రీనింగ్, టీబీ కేసులు వంటి అంశాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
గర్భిణుల ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సోమవారం పీహెచ్ సీలకు వచ్చే గర్భిణులకు అంగన్వాడీల ద్వారా వేడి వేడి భోజనం , ఐరన్ మందులు, పౌష్టికాహారం అందేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ, ప్రసవాలు అధికంగా జరిగేలా వైద్య సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పని చేయాలని తెలిపారు. ఇమ్యూనైజేషన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని, ప్రతి మంగళవారం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో 10 నిమిషాల కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సూపర్ వైజర్లు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
తీవ్రమైన పోషకాహార లోపం, తక్కువ బరువు, ఎదుగుదల లోపాలు, చెవిటి, మూగ, మానసిక సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాలు, మెదడు సంబంధిత సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి, ఆర్బీ ఎస్కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి వైద్య సేవలు కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన వారికి కరీంనగర్ ఎన్ ఆర్ సీ కేంద్రం, హైదరాబాద్ లో ఉన్నత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలో 531 టీబీ కేసులు ఉన్నాయని, ముందస్తుగా గుర్తిస్తే చికిత్సతో నయం చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. టీబీని విస్మరిస్తే ఇతరులకు సోకే ప్రమాదం ఉందని, లక్షణాలు గల వారిని గుర్తించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఎన్.సి.డీ స్క్రీనింగ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి, అవసరమైన వారికి చికిత్స , క్యాన్సర్ పరీక్షలు చేసి తదుపరి చికిత్స సూచించారు.
మొబైల్ ఎక్స్ రే యంత్రాన్ని అవసరమైన చోట వినియోగించి పరీక్షలు చేయాలని, నిర్ధారణ అయిన వారికి వైద్యం, మందులు ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా వైద్య అధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, డీసీహెచ్ఎస్ సుభాషిణి, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


