అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లాలోని శివ గాయత్రి వృద్ధాశ్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వృద్ధులకు పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం నిత్యావసర వస్తువులను కూడా అందజేశారు.
జగిత్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ ఇనుగుర్తి రాజశేఖర్ (దంతవైద్యులు), డాక్టర్ శ్రవణ్ (చెవి, ముక్కు, గొంతు వైద్యులు), మరియు డాక్టర్ రఘురాం (కంటి వైద్యులు) లు వృద్ధులకు రక్తపోటు, షుగర్ పరీక్షలు, , కంటిచూపు, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా వారికి రోజువారీ ఉపయోగపడే నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల డిస్ట్రిక్ట్ చైర్మన్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ భీమానాతిని ఉమా, స్టేట్ ఎగ్జిటివ్ కమిటీ మెంబర్ సిరిసిల్ల శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ మెంబర్స్ చిత్తారి మధుకర్, సిరిపురం శ్రీనివాస్, గుండ సురేష్, శివ గాయత్రి వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.
తదనంతరం, జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జగిత్యాల సివిల్ హాస్పిటల్ లోని బ్లడ్ బ్యాంకులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం ప్రాముఖ్యతను వివరిస్తూ, రక్తం ఇవ్వడం అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వవచ్చని, ప్రజలలో దీనిపై ఇంకా అవగాహన రావాలని రెడ్ క్రాస్ ప్రతినిధులు తెలిపారు. ఆపద సమయంలో రక్తం దొరకక ఇబ్బంది పడే సందర్భాలు ఎన్నో ఉన్నాయని, దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ రక్తదాన కార్యక్రమంలో వైద్యులు, రెడ్ క్రాస్ చైర్మన్, సభ్యులు, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్నవారికి రక్తం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా సూచించారు.







