తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు పెండింగ్ డీఏ ()ల విడుదలకు ఆమోదం తెలిపింది. అలాగే, కుటుంబ యజమాని అకాల మరణానికి రూ. 5 లక్షల భద్రత కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఖరారు చేసింది.
ధరణి పోర్టల్ లోపాలు, వివాదాస్పద 22-ఏ (22) నిషేధిత భూముల జాబితా సవరణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 పొడిగింపు డీపీఆర్ () అంచనాలపై సమీక్షించింది.
మూసీ ప్రాజెక్ట్, గ్లోబల్ సమ్మిట్
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ఫేజ్-1కు అవసరమైన భూసేకరణ, పునరావాస ప్యాకేజీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడుల కోసం డిసెంబర్ లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్-2026 సన్నాహాలపై చర్చించింది.
కరువు, రింగ్ రోడ్, విద్యాసంస్థలు
ఎల్ నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలపై సమీక్షించింది. రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణ పనుల వేగవంతం, నిధుల కేటాయింపులపై తుది నిర్ణయాలు తీసుకుంది. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడంపై ఆమోదం తెలిపింది.












