తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. శుక్రవారం పట్టణంలోని ఆర్.ఆర్. గార్డెన్స్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షులుగా ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా బాలె శేఖర్, గౌరవ సలహాదారుగా మచ్చ గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా జూపల్లి వేణుగోపాలరావు, కోశాధికారిగా దేశవేని జనార్ధన్, ఉపాధ్యక్షులుగా కైరం సత్యం గౌడ్, సంయుక్త కార్యదర్శిగా మెట్టపల్లి మహేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా అత్తినేని శంకర్, ఇసాక్ అబ్రహం, సత్యనారాయణ, తిరుపతి, ఆఫీస్, సాదిక్ ఎన్నికయ్యారు.
ఎన్నికల ప్రక్రియ
ఈ ఎన్నికల ప్రక్రియను ట్రస్మా జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రావు, ప్రధాన కార్యదర్శి మహదేవ్, గౌరవ అధ్యక్షులు బోగ రవి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల రాజేష్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి రవీందర్ రెడ్డి ల ప్రత్యక్ష పర్యవేక్షణలో సజావుగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని, మండల వారిగా ఏ సమస్యలున్న పరిష్కరించడానికి ముందుంటామన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు యాదగిరితో పాటు పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు.


