జగిత్యాల మండలం పరిధిలోని ధర్మారం గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పరమాల సుమలత, మల్లేశం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
ధర్మారం గ్రామంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో సర్పంచ్ పరమాల సుమలత, మల్లేశం పాల్గొన్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుమలత, మల్లేశం మాట్లాడుతూ, గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గ్రామంలో కొత్తగా ఉపాధి పనులను గుర్తించి, అవసరమైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేయాలని, బాలల హక్కులను కాపాడాలని సూచించారు. ముఖ్యంగా బాల్య వివాహాలు చేయకూడదని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దీకొండ ప్రేమ్ నాథ్, కార్యదర్శి తిరుపతి, కారోబార్ వినోద్, వార్డు సభ్యులు కోరేపు రాజకుమార్, గిద్దె లత, ధనేశ్వరరావు, మేఘన, సుగుణ, ఏఎన్ఎం అంగన్వాడి టీచర్ గీత, ఆశా వర్కర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.












