జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిని సులోచన రాణి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారు. శనివారం నడిగూడెం కే ఎల్ ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు ఉచిత యూనిఫాంలను పంపిణీ చేశారు.
ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం రాత పుస్తకాలు, యూనిఫాంలు, షూస్, బెల్ట్, ఐడీ కార్డుతో పాటు బ్యాగులను పంపిణీ చేస్తోందని, త్వరలో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించడానికి కూడా సన్నాహాలు చేస్తోందని సులోచన రాణి తెలిపారు. ఈ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆమె కోరారు.
క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డి విజయ నాయక్, అధ్యాపకులు డాక్టర్ జాన్ పాషా, కృష్ణ, మహేష్, ఈశ్వర్, నాగరాజు, శ్రీనివాసరావు, డాక్టర్ కోళ్లు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, తేజశ్రీ, రజిత, సుజాత తదితరులు పాల్గొన్నారు.


