జగిత్యాల జిల్లా మండల కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ చంద్రశేఖర్‌పై అర్ధరాత్రి కర్రతో దాడి జరిగింది. సబ్ స్టేషన్ పరిసరాల్లో చెత్త వేయడం, బహిర్భూమికి వెళ్లడం వంటి వాటిపై మందలించినందుకు కక్ష సాధింపు చర్యగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ చంద్రశేఖర్‌పై అర్ధరాత్రి కర్రతో దాడి జరిగింది. ఈ దాడిలో పల్లెపు రాజు అనే వ్యక్తి చంద్రశేఖర్‌పై దాడి చేయగా, ఆయనకు గాయాలయ్యాయి. చంద్రశేఖర్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
లోని సబ్ స్టేషన్ పక్కన నివాసం ఉంటున్న పల్లెపు శంకర్ కుటుంబ సభ్యులు సబ్ స్టేషన్ పరిసరాల్లోకి వచ్చి తరచూ చెత్త వేయడం, బహిర్భూమికి వెళ్లడం వంటివి చేస్తుండేవారు. దీనిపై చంద్రశేఖర్ వారిని మందలించగా, ఆ విషయం మనసులో పెట్టుకున్న పల్లెపు రాజు, సబ్ స్టేషన్ ఆపరేటర్ చంద్రశేఖర్‌పై కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన చంద్రశేఖర్‌ను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.
విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడి చేయడంతో తోటి సిబ్బంది, యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సై గీత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.











